కంటెంట్‌కు వెళ్లండి

The Reward of Saints గురించి బైబిల్ వచనాలు

85 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.

  2. నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.

  3. మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.

  4. దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.

  5. శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.

  6. ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”

  7. ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.

  8. తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు.

  9. మహా వృద్ధుడు వచ్చి సర్వోన్నతుని పరిశుద్ధుల పక్షంగా తీర్పు చెప్పే వరకు అది అలా చేసింది. కాని సమయం వచ్చినప్పుడు వారు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు.

  10. జ్ఞానులైనవారు ఆకాశ ప్రకాశంతో ప్రకాశిస్తారు, అనేకులను నీతిమార్గం లోనికి నడిపించేవారు నక్షత్రాల్లా నిత్యం ప్రకాశిస్తారు.

  11. హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.

  12. సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.

  13. ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.

  14. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.

  15. అందుకు యేసు వారితో, “అన్ని నూతన పరచబడిన తర్వాత మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారిని తీర్పుతీర్చుతారు.

  16. నీవు నీ కూలిని తీసుకుని వెళ్లు. నేను నీకు ఇచ్చినట్టే చివర వచ్చిన వానికి ఇవ్వడం నా ఇష్టము.

  17. నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.

  18. “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.

  19. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.

  20. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేనివారికి, దుష్టులకు కూడా దయ చూపించేవాడు.

  21. “చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.

  22. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.

  23. Who shall not receive manifold more in this present time, and in the world to come life everlasting.

  24. కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.

  25. That ye may eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel.