The Reward of Saints గురించి బైబిల్ వచనాలు: Saints may feel confident of
Saints may feel confident of గురించి వచనాలు
మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.
శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.
ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”
మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.
కాబట్టి నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.