కంటెంట్‌కు వెళ్లండి

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఆసియా ప్రాంతపు యూదులు కొందరు ఉన్నారు, వారికి నాపై ఏమైనా వ్యతిరేకత ఉంటే మీ దగ్గరకు వచ్చి నా మీద నేరం మోపి ఉండ వచ్చునేమో.

  2. లేదా ఇక్కడ ఉన్నవారు నేను న్యాయసభ ముందు నిలబడినప్పుడు నాలో ఏ నేరాన్ని కనుగొన్నారో వారే చెప్పాలి.

  3. అయితే ఆసియా ప్రాంతపు యూదుల మధ్యలో నేను ఉన్నప్పుడు, ‘నేడు మృతుల పునరుత్థానం గురించి మీ ముందు విమర్శకు గురవుతున్నాను’ అని బిగ్గరగా చెప్పినదాని బట్టి తప్ప మరి ఏ నేరమున్నదో వారే తెలియచేయాలి” అన్నాడు.

  4. అప్పుడు, ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగా తెలిసినవాడు కాబట్టి, “లూసియ అధిపతి వచ్చినప్పుడు నేను నీ సంగతిని విచారణ చేస్తాను” అని చెప్పి విచారణ వాయిదా వేశాడు.

  5. అతడు పౌలును కాపలాలో ఉంచి, అతని అవసరాలను తీర్చడానికి అతని స్నేహితుల్లో ఎవరిని ఆటంకపరచవద్దు అని శతాధిపతిని ఆదేశించాడు.

  6. కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కలసి వచ్చాడు. అతడు పౌలును పిలిపించి యేసు క్రీస్తులోని విశ్వాసాన్ని గురించి అతడు బోధించిన మాటలను విన్నాడు.

  7. పౌలు నీతి గురించి, మనస్సును అదుపులో ఉంచుకోవడం గురించి, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.

  8. పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.

  9. రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.

  10. అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీ సమాధానం చెప్పుకోడానికి నిన్ను అనుమతిస్తున్నాను” అన్నాడు. కాబట్టి పౌలు తన చేయి చాపి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు:

  11. అగ్రిప్ప రాజా, యూదులు నా మీద వేసిన ఫిర్యాదులన్నిటికి నా సమాధానం తెలియజేయడానికి,

  12. ఈ రోజు మీ ముందు నిలబడి ఉండడం నా భాగ్యం అని భావిస్తున్నాను, ఎందుకంటే మీరు యూదుల ఆచారాలు వివాదాల గురించి బాగా తెలిసిన వారు. కాబట్టి నా సమాధానం ఓపికతో వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

  13. నా సొంత ప్రాంతంలో, యెరూషలేములో నేను నా బాల్యం నుండి జీవించిన విధానం గురించి యూదులందరికి తెలుసు.

  14. వారికి నేను చాలా కాలం నుండి పరిచయస్తుడినే కాబట్టి వారికి ఇష్టమైతే, నేను పరిసయ్యునిగా జీవిస్తూ మా మతాచారాలను ఖచ్చితంగా పాటించే వాడినని వారే సాక్ష్యం ఇవ్వగలరు.

  15. దేవుడు మన పితరులకు ఇచ్చిన వాగ్దానం గురించి నాకున్న నిరీక్షణ బట్టి ఈ రోజు నన్ను ఈ విచారణకు నిలబెట్టారు.

  16. మన పన్నెండు గోత్రాల ఇశ్రాయేలీయులు పగలు రాత్రి దేవుని సేవించడం ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తామనే నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే అగ్రిప్ప రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నన్ను నిందిస్తున్నారు.

  17. దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు?

  18. “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను.

  19. యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్య యాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని పరిశుద్ధులలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను.

  20. అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాల్లో కూడా వారిని వెంటాడాను.

  21. “అలా చేస్తూ ఒక రోజు నేను ముఖ్య యాజకుల నుండి అధికార పత్రం తీసుకుని దమస్కు పట్టణానికి బయలుదేరాను.

  22. అగ్రిప్ప రాజా, ఇంచుమించు మధ్యాహ్న సమయంలో, నేను దారిలో ఉన్నప్పుడు, సూర్యుని కన్న ప్రకాశమైన వెలుగు పరలోకం నుండి వచ్చి నా చుట్టూ నాతో ఉన్న వారి చుట్టూ ప్రకాశించడం నేను చూశాను.

  23. అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.

  24. “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,

  25. నీవు లేచి నిలబడు, ఇకమీదట నీవు నా గురించి చూసినవాటికి చూడబోయే వాటికి సాక్షిగా సేవకునిగా నిన్ను నియమించడానికే నేను నీకు ప్రత్యక్షమయ్యాను.