Skip to content

Sanctification గురించి బైబిల్ వచనాలు

117 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కోసం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.

  2. “ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను.

  3. నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను.

  4. వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కళ్ళను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.

  5. అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.

  6. That I should be the minister of Jesus Christ to the Gentiles, ministering the gospel of God, that the offering up of the Gentiles might be acceptable, being sanctified by the Holy Ghost.

  7. క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది:

  8. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.

  9. తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,

  10. దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  11. మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.

  12. మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.

  13. నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.

  14. నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.

  15. ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.

  16. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.

  17. ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది.

  18. అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.

  19. ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.

  20. ఎందుకంటే మనకు తెలిసింది కొంచెమే, మనం ప్రవచించేది కొంతవరకే.

  21. కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి.

  22. నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాన్ని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేశాను.

  23. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం అద్దంలో కనబడే ప్రతిబింబమే; కాని తర్వాత ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది కొంతమాత్రమే, తర్వాత నేను పూర్తిగా తెలుసుకోబడిన ప్రకారం నేను పూర్తిగా తెలుసుకుంటాను.

  24. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.

  25. మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.