Sanctification గురించి బైబిల్ వచనాలు: The Lord, the sanctifier
The Lord, the sanctifier గురించి వచనాలు
“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.
నా శాసనాలను పాటించి వాటి ప్రకారం నడుచుకోండి. మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.
మీ దేవునికి ఆహారం వారే అర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులు అని మీరు పరిగణించాలి. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే నేను పరిశుద్ధుడైన యెహోవాను కాబట్టి వారిని పరిశుద్ధులుగా భావించాలి.
“ ‘యాజకులు నాకు పరిచర్య చేసినప్పుడు వారికి ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించి దానిని అపవిత్రపరిస్తే దాని పాపదోషం తమ మీదకు చావు తెచ్చుకుంటే దానికి వారే బాధ్యులు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.