Skip to content

Sabbath గురించి బైబిల్ వచనాలు

239 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు.

  2. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు.

  3. ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  4. “ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  5. “ ‘నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.

  6. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  7. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను నియమించిన పండుగలు, యెహోవాకు నియమించబడిన పండుగలు, మీరు పరిశుద్ధ సమాజంగా చాటాల్సిన పండుగలు ఇవి.

  8. “ ‘వారంలో ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు సబ్బాతు విశ్రాంతి దినం, పరిశుద్ధ సమాజపు రోజు. అప్పుడు మీరు ఏ పని చేయకూడదు; మీరు ఎక్కడ నివసించినా, అది యెహోవాకు సబ్బాతు దినము.

  9. “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.

  10. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.

  11. ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.

  12. ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను.

  13. మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడున్నా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  14. అది మీకు సబ్బాతు విశ్రాంతి దినం, మీరు ఉపవాసముండాలి. ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి మర్నాడు సాయంత్రం వరకు సబ్బాతును ఆచరించాలి.”

  15. నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.

  16. “ ‘మీరు నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.

  17. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు భూమి తన సబ్బాతు సంవత్సరాలను ఆనందిస్తుంది తద్వార ఎప్పటికీ అది నిర్జనమై ఉంటుంది; అప్పుడు భూమి విశ్రాంతి తీసుకుని దాని సబ్బాతు దినాలను ఆనందిస్తుంది.

  18. అన్ని సమయాల్లో అది నిర్జనమై ఉంటుంది, మీరు అందులో నివసించినప్పుడు సబ్బాతు దినాల్లో అది పొందని విశ్రాంతిని పొందుతుంది.

  19. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక మనుష్యుడు సబ్బాతు దినాన్న కట్టెలు ఏరుకుంటున్నాడు.

  20. అది చూసినవారు అతన్ని పట్టుకుని, మోషే అహరోనుల ఎదుట సమాజమందరి ఎదుట నిలబెట్టారు.

  21. అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు.

  22. అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనుష్యుడు చావాలి. సమాజమంతా అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి.”

  23. కాబట్టి యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.

  24. “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.

  25. ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.