కంటెంట్‌కు వెళ్లండి

Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు

55 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము.

  2. మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.

  3. బలవంతులు శక్తిమంతులైన దేవదూతలు సహితం ప్రభువు తీర్పు తెచ్చినప్పుడు వారిని అలా దూషించరు.

  4. అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.

  5. మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు.