Skip to content

Pilgrims and Strangers గురించి బైబిల్ వచనాలు

53 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.

  2. “నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు.

  3. యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు.

  4. వారు విదేశీయులుగా ఉండిన కనాను దేశాన్ని వారికి ఇస్తాననే నా నిబంధనతో నేను వారిని స్థిరపరిచాను.

  5. దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి.

  6. ఒక రోజు మోషే తన మామ మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడైన హోబాబుతో, “యెహోవా, ‘నేను మీకు ఇస్తాను’ అని చెప్పిన స్థలానికి వెళ్తున్నాము. నీవు మాతో వచ్చెయ్యి, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలుకు మంచి వాటిని వాగ్దానం చేశారు” అని చెప్పాడు.

  7. నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.

  8. మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.

  9. “యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.

  10. మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.

  11. “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా!

  12. వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు, వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు; తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో కప్పివేస్తుంది.

  13. వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు వారి బలం అధికమవుతుంది.

  14. ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.

  15. నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము.

  16. నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!

  17. సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.

  18. నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

  19. వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి ఆ దారిలో ప్రయాణిస్తారు. వారు వచ్చి మరచిపోలేని శాశ్వతమైన ఒడంబడికలో యెహోవాకు కట్టుబడి ఉంటారు.

  20. “భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు.

  21. “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి.

  22. అప్పుడు పేతురు, “ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి దొరకుతుంది” అని ఆయనను అడిగాడు.

  23. అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు.

  24. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.

  25. “ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.