Skip to content

Old Age గురించి బైబిల్ వచనాలు

39 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము.

  2. అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా?

  3. కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

  4. While the sun, or the light, or the moon, or the stars, be not darkened, nor the clouds return after the rain:

  5. ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు, బలిష్ఠులు వంగిపోతారు, తిరగలి విసిరేవారు కొంతమందే ఉండడంతో పని ఆపివేస్తారు, కిటికీలో నుండి చూచేవారి దృష్టి మందగిస్తుంది.

  6. వీధి తలుపులు మూసేస్తారు; తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు, పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.

  7. మనుష్యులు ఎత్తైన స్థలాలకు వీధుల్లో అపాయాలకు భయపడతారు; బాదం చెట్టు పూలు పూస్తుంది మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు ఇక కోరికలు రేపబడవు. మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు.

  8. వెండితాడు తెగిపోక ముందే, బంగారు గిన్నె పగిలిపోక ముందే, నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే, బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

  9. మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.

  10. మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.

  11. తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది.

  12. వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.

  13. అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు.

  14. ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.