Skip to content

Molech గురించి బైబిల్ వచనాలు

27 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.

  2. “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలులో స్వదేశీయులు గాని విదేశీయులు గాని తమ పిల్లలను మోలెకు దేవతకు అర్పిస్తే అలాంటి వారికి మరణశిక్ష విధించాలి. సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలి.

  3. వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను.

  4. ఎవరైన తమ పిల్లలను మోలెకుకు అర్పించినప్పుడు మీ దేశ ప్రజలు చూసి చూడనట్లు తమ కళ్లు మూసుకుని వారిని చంపకుండా వదిలేస్తే,

  5. స్వయంగా నేనే వారికి వారి కుటుంబానికి వ్యతిరేకంగా మారి వారిని వారితో పాటు కలిసి మోలెకుతో వ్యభిచరించే వారినందరిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.

  6. రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు.

  7. “మీరు వారితో పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వారు ఖచ్చితంగా మీ హృదయాలను వారి దేవుళ్ళ వైపు త్రిప్పుతారు” అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ దేశాల వారి గురించే చెప్పారు. అయినప్పటికీ, సొలొమోను వారిని చాలా ప్రేమించాడు.

  8. అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు.

  9. సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.

  10. సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును అనుసరించాడు.

  11. కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు.

  12. సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు.

  13. తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు.

  14. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాల హేయక్రియలు చేసి, తన కుమారున్ని అగ్నిలో బలి ఇచ్చాడు.

  15. అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.

  16. తర్వాత ఎవరు కూడా తన కుమారుని గాని, కుమార్తెను గాని మోలెకు విగ్రహం ముందు అగ్నిగుండం దాటించకుండా ఉండేలా అతడు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే స్థలాన్ని అపవిత్రపరచాడు.

  17. అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు.

  18. మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.

  19. వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు.

  20. వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.

  21. “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా?

  22. నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు.

  23. వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’

  24. నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  25. వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు.