Skip to content

Molech

8 వచనాలు

Molech ను ప్రస్తావించే వచనాలు

  1. “ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.

  2. “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలులో స్వదేశీయులు గాని విదేశీయులు గాని తమ పిల్లలను మోలెకు దేవతకు అర్పిస్తే అలాంటి వారికి మరణశిక్ష విధించాలి. సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలి.

  3. వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను.

  4. ఎవరైన తమ పిల్లలను మోలెకుకు అర్పించినప్పుడు మీ దేశ ప్రజలు చూసి చూడనట్లు తమ కళ్లు మూసుకుని వారిని చంపకుండా వదిలేస్తే,

  5. స్వయంగా నేనే వారికి వారి కుటుంబానికి వ్యతిరేకంగా మారి వారిని వారితో పాటు కలిసి మోలెకుతో వ్యభిచరించే వారినందరిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.

  6. సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు.

  7. తర్వాత ఎవరు కూడా తన కుమారుని గాని, కుమార్తెను గాని మోలెకు విగ్రహం ముందు అగ్నిగుండం దాటించకుండా ఉండేలా అతడు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే స్థలాన్ని అపవిత్రపరచాడు.

  8. వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.