Skip to content

Jerusalem గురించి బైబిల్ వచనాలు

271 వచనాలు · 117 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.

  2. సౌలు స్తెఫెను చావును సమ్మతించాడు. ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి విరోధంగా తీవ్రమైన హింస చెలరేగింది, కాబట్టి అపొస్తలులు తప్ప మిగిలిన సంఘమంతా యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయింది.

  3. దైవభయం గల విశ్వాసులు స్తెఫెనును సమాధి చేసి అతని కోసం ఎంతో రోదించారు.

  4. అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.

  5. చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు.

  6. స్తెఫెను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు.

  7. వారిలో కుప్ర కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు.

  8. ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు.

  9. ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు.

  10. అక్కడ ముఖ్య యాజకులు యూదా నాయకులు అతన్ని కలిసి పౌలుకు వ్యతిరేకంగా తాము చేసిన ఫిర్యాదును తెలియజేశారు.

  11. వెళ్తున్నప్పుడే మధ్యలో పౌలును చంపాలని కుట్రను పన్ని, పౌలును యెరూషలేముకు పంపించమని ఫేస్తును వేడుకొన్నారు.

  12. అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను.

  13. కాబట్టి మీలో కొందరు నాయకులు నాతో రండి. అతడు ఏమైన తప్పు చేస్తే అది అతనిపై మోపవచ్చు” అని చెప్పాడు.

  14. వారితో ఎనిమిది, పది రోజులు గడిపిన తర్వాత ఫేస్తు అధిపతి కైసరయకు వెళ్లాడు. మరుసటిరోజు అతడు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు తీసుకుని రమ్మని ఆదేశించాడు.

  15. పౌలు లోపలికి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడ్డారు. అతని మీద అనేక తీవ్ర ఆరోపణలు చేశారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు.

  16. అప్పుడు పౌలు సమాధానం చెప్పుతూ, “నేను యూదుల ధర్మశాస్త్రానికి గాని దేవాలయానికి గాని లేదా కైసరుకు గాని వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదు” అని చెప్పాడు.

  17. ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు.

  18. అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు.

  19. ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.

  20. ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కాబట్టి నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.

  21. కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు.