కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem గురించి బైబిల్ వచనాలు: Water supply brought in from the Gihon by Hezekiah

8 వచనాలు · 117 కోణాలు

Water supply brought in from the Gihon by Hezekiah గురించి వచనాలు

  1. అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు.

  2. వారు పెద్ద గుంపుగా చేరి, “అష్షూరు రాజులు వచ్చి ఇక్కడ పుష్కలమైన నీరు ఉన్నట్లు తెలుసుకోవడం ఎందుకు?” అనుకుని ఆ ప్రాంతం గుండా ప్రవహించే నీటి ఊటలన్నిటిని, ప్రవాహాన్ని అడ్డుకున్నారు.

  3. రాత్రివేళలో నేను లోయ ద్వారం గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను.

  4. అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది.

  5. రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను.

  6. దావీదు పట్టణపు గోడలు చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు దిగువన ఉన్న కొలనులో మీరు నీటిని సమకూర్చారు.

  7. మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు.

  8. పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.