Jerusalem గురించి బైబిల్ వచనాలు: Finally dispossessed of, by David
Finally dispossessed of, by David గురించి వచనాలు
యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.
అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.
ఆ రోజే దావీదు, “యెబూసీయుల మీద దాడి చేయాలనుకునేవారు నీటి సొరంగం గుండా వెళ్లి దావీదు శత్రువులైన గ్రుడ్డివారిని కుంటివారిని చంపాలి” అన్నాడు. ఆ కారణంగానే, “గ్రుడ్డివారు కుంటివారు రాజభవనం లోపలికి రాలేరు” అనే సామెత పుట్టింది.