Skip to content

Hell గురించి బైబిల్ వచనాలు

48 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు; మరణమే వారికి కాపరి. యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు. వారి రాజభవనాలకు దూరంగా, సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి.

  2. కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు; ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. సెలా

  3. బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.

  4. ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,

  5. ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,

  6. “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:

  7. “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!”

  8. అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.

  9. నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.

  10. బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.

  11. పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.

  12. వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు.

  13. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.

  14. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.

  15. “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు.

  16. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.

  17. అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.

  18. కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోకి త్రోసివేయబడతారు. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”

  19. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు.

  20. ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు.

  21. “కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది.

  22. మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు.

  23. వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.

  24. ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు.

  25. ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.