Skip to content

Drunkenness గురించి బైబిల్ వచనాలు

52 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి శ్రమపడినదానా, ఈ మాట విను.

  2. తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు.

  3. ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

  4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.

  5. వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”

  6. “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’

  7. అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  8. బబులోను యెహోవా చేతిలో బంగారు గిన్నె; అది భూమినంతటిని మత్తెక్కించింది. అన్ని దేశాలు దాని ద్రాక్షారసాన్ని త్రాగాయి; కాబట్టి వారు ఇప్పుడు పిచ్చివారైపోయారు.

  9. బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

  10. “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’

  11. నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.

  12. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు, అది లోతైన పెద్ద గిన్నె; అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది, అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది.

  13. నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు, నీ సోదరియైన సమరయ గిన్నె, శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె.

  14. అడుగు వరకు దానిలోనిది త్రాగి ఆ పాత్రను ముక్కలు చేసి, వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు. ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు.

  16. బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు.

  17. కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు.

  18. వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు.

  19. “తన పొరుగువారి నగ్న శరీరాలను చూడాలని, వారు మత్తులో మునిగిపోయేలా కోపంతో వారికి ద్రాక్షరసం పోసేవారికి శ్రమ!

  20. కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది, అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.

  21. లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.

  22. తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.

  23. అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు.

  24. అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.

  25. శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము;