Skip to content

Aaron గురించి బైబిల్ వచనాలు

145 వచనాలు · 27 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు షల్లూముకు తండ్రి,

  2. షల్లూము హిల్కీయాకు తండ్రి, హిల్కీయా అజర్యాకు తండ్రి,

  3. అజర్యా శెరాయాకు తండ్రి, శెరాయా యెహోజాదాకుకు తండ్రి.

  4. యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.

  5. వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,

  6. అతని కుమారుడు బుక్కీ, అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,

  7. అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,

  8. అతని కుమారుడు సాదోకు, అతని కుమారుడు అహిమయస్సు.

  9. అమ్రాము కుమారులు: అహరోను, మోషే. అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు.

  10. ఇవి అహరోను వారసుల విభాగాలు: అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

  11. నాదాబు, అబీహు కుమారులు లేకుండానే తమ తండ్రి కంటే ముందే చనిపోయారు; కాబట్టి ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.

  12. వారు ఉజ్జియా రాజును ఎదిరించి, “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను వారసులైన యాజకులే ఆ పని చేయాలి. ధూపం వేయడానికి వారే ప్రతిష్ఠించబడ్డారు. పరిశుద్ధాలయం నుండి వెళ్లు. నీవు నమ్మకద్రోహిగా ఉన్నావు. దానివలన యెహోవా దేవుని వలన ఘనపరచబడవు” అన్నారు.

  13. మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.

  14. దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.

  15. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు.

  16. దండులో మోషే మీద, యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది.

  17. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను. మీకు దారి చూపడానికి మోషే అహరోను మిర్యాములను పంపించాను.

  18. వారు అహరోనుతో, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు.

  19. ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.

  20. దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి.