Skip to content

Aaron గురించి బైబిల్ వచనాలు: Descendants of

19 వచనాలు · 27 కోణాలు

Descendants of గురించి వచనాలు

  1. అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.

  2. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది.

  3. అమ్రాము పిల్లలు: అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

  4. ఎలియాజరు ఫీనెహాసుకు తండ్రి, ఫీనెహాసు అబీషూవకు తండ్రి,

  5. అబీషూవ బుక్కీకి తండ్రి, బుక్కీ ఉజ్జీకి తండ్రి,

  6. ఉజ్జీ జెరహ్యాకు తండ్రి, జెరహ్యా మెరాయోతుకు తండ్రి,

  7. మెరాయోతు అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,

  8. అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు అహిమయస్సుకు తండ్రి,

  9. అహిమయస్సు అజర్యాకు తండ్రి, అజర్యా యోహానానుకు తండ్రి,

  10. యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.

  11. అజర్యా అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,

  12. అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు షల్లూముకు తండ్రి,

  13. షల్లూము హిల్కీయాకు తండ్రి, హిల్కీయా అజర్యాకు తండ్రి,

  14. అజర్యా శెరాయాకు తండ్రి, శెరాయా యెహోజాదాకుకు తండ్రి.

  15. యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.

  16. వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,

  17. అతని కుమారుడు బుక్కీ, అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,

  18. అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,

  19. అతని కుమారుడు సాదోకు, అతని కుమారుడు అహిమయస్సు.