కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 13:56సుమారు క్రీ.శ. 31

    ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు.

  2. మత్తయి 13:57సుమారు క్రీ.శ. 31

    అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.

  3. మత్తయి 13:58సుమారు క్రీ.శ. 31

    వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.

  4. మత్తయి 14:1సుమారు క్రీ.శ. 32

    ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని,

  5. మత్తయి 14:2సుమారు క్రీ.శ. 32

    తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను; చనిపోయి మళ్ళీ బ్రతికాడు. అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని అన్నాడు.

  6. మత్తయి 14:3సుమారు క్రీ.శ. 32

    హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు.

  7. మత్తయి 14:4సుమారు క్రీ.శ. 32

    ఎందుకంటే అంతకుముందు యోహాను హేరోదుతో: “నీవు ఆమెను ఉంచుకోవడం న్యాయం కాదు” అని చెప్పాడు.

  8. మత్తయి 14:5సుమారు క్రీ.శ. 32

    కాబట్టి హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేకపోయాడు.

  9. మత్తయి 14:6సుమారు క్రీ.శ. 32

    అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.

  10. మత్తయి 14:7సుమారు క్రీ.శ. 32

    కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.

  11. మత్తయి 14:8సుమారు క్రీ.శ. 32

    ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.

  12. మత్తయి 14:9సుమారు క్రీ.శ. 32

    రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులను బట్టి తాను చేసిన ప్రమాణం కోసం ఆమె కోరినట్లు చేయమని ఆదేశించాడు.

  13. మత్తయి 14:10సుమారు క్రీ.శ. 32

    అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు.

  14. మత్తయి 14:11సుమారు క్రీ.శ. 32

    వారు బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆమె తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది.

  15. మత్తయి 14:12సుమారు క్రీ.శ. 32

    యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేశారు.

  16. మత్తయి 14:13సుమారు క్రీ.శ. 32

    యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడినుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు.

  17. మత్తయి 14:14సుమారు క్రీ.శ. 32

    యేసు పడవ దిగి గొప్ప జనసమూహం రావడం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగాలతో ఉన్నవారిని స్వస్థపరిచారు.

  18. మత్తయి 14:15సుమారు క్రీ.శ. 32

    సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కాబట్టి జనసమూహాలను పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.

  19. మత్తయి 14:16సుమారు క్రీ.శ. 32

    యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు.

  20. మత్తయి 14:17సుమారు క్రీ.శ. 32

    వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.

  21. మత్తయి 14:18సుమారు క్రీ.శ. 32

    ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు.

  22. మత్తయి 14:19సుమారు క్రీ.శ. 32

    వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.

  23. మత్తయి 14:20సుమారు క్రీ.శ. 32

    వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.

  24. మత్తయి 14:21సుమారు క్రీ.శ. 32

    తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

  25. మత్తయి 14:22సుమారు క్రీ.శ. 32

    వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.