కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 14:23సుమారు క్రీ.శ. 32

    ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు.

  2. మత్తయి 14:24సుమారు క్రీ.శ. 32

    అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి.

  3. మత్తయి 14:25సుమారు క్రీ.శ. 32

    రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు.

  4. మత్తయి 14:26సుమారు క్రీ.శ. 32

    ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.

  5. మత్తయి 14:27సుమారు క్రీ.శ. 32

    వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.

  6. మత్తయి 14:28సుమారు క్రీ.శ. 32

    పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు.

  7. మత్తయి 14:29సుమారు క్రీ.శ. 32

    అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు.

  8. మత్తయి 14:30సుమారు క్రీ.శ. 32

    కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు.

  9. మత్తయి 14:31సుమారు క్రీ.శ. 32

    వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు.

  10. మత్తయి 14:32సుమారు క్రీ.శ. 32

    వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది.

  11. మత్తయి 14:33సుమారు క్రీ.శ. 32

    అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.

  12. మత్తయి 14:34సుమారు క్రీ.శ. 32

    వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు.

  13. మత్తయి 14:35సుమారు క్రీ.శ. 32

    అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కాబట్టి ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.

  14. మత్తయి 14:36సుమారు క్రీ.శ. 32

    నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు.

  15. మత్తయి 15:1సుమారు క్రీ.శ. 32

    అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి,

  16. మత్తయి 15:2సుమారు క్రీ.శ. 32

    “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు.

  17. మత్తయి 15:3సుమారు క్రీ.శ. 32

    అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, “మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు?

  18. మత్తయి 15:4సుమారు క్రీ.శ. 32

    ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పారు.

  19. మత్తయి 15:5సుమారు క్రీ.శ. 32

    కానీ మీరు, ఎవరైనా తమ తండ్రితో గాని తల్లితో గాని సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే,

  20. మత్తయి 15:6సుమారు క్రీ.శ. 32

    వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు.

  21. మత్తయి 15:7సుమారు క్రీ.శ. 32

    వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:

  22. మత్తయి 15:8సుమారు క్రీ.శ. 32

    “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;

  23. మత్తయి 15:9సుమారు క్రీ.శ. 32

    వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ”

  24. మత్తయి 15:10సుమారు క్రీ.శ. 32

    యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి.

  25. మత్తయి 15:11సుమారు క్రీ.శ. 32

    నోటిలోకి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు.