circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
ఈ కాలపు వచనాలు
- అపొస్తలుల కార్యములు 15:7సుమారు క్రీ.శ. 51
చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంతకాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా!
- అపొస్తలుల కార్యములు 15:8సుమారు క్రీ.శ. 51
హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు.
- అపొస్తలుల కార్యములు 15:9సుమారు క్రీ.శ. 51
దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.
- అపొస్తలుల కార్యములు 15:10సుమారు క్రీ.శ. 51
కాబట్టి ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు!
- అపొస్తలుల కార్యములు 15:11సుమారు క్రీ.శ. 51
వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”
- అపొస్తలుల కార్యములు 15:12సుమారు క్రీ.శ. 51
బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్భుతాలను సూచకక్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రద్ధతో నిశ్శబ్దంగా విన్నారు.
- అపొస్తలుల కార్యములు 15:13సుమారు క్రీ.శ. 51
వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి.
- అపొస్తలుల కార్యములు 15:14సుమారు క్రీ.శ. 51
యూదేతరులలో నుండి దేవుడు తన నామము కోసం ప్రజలను ఏర్పరచుకోడానికి తానే మొదట ఎలా జోక్యం చేసుకున్నాడో సీమోను వివరించాడు.
- అపొస్తలుల కార్యములు 15:15సుమారు క్రీ.శ. 51
దీనిని గురించి ప్రవక్తల మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి, ఎలాగంటే:
- అపొస్తలుల కార్యములు 15:16సుమారు క్రీ.శ. 51
“ ‘ఆ తర్వాత నేను తిరిగివచ్చి, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను. దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, దానిని పునరుద్ధరిస్తాను,
- అపొస్తలుల కార్యములు 15:17సుమారు క్రీ.శ. 51
అప్పుడు మిగిలిన వారందరు, నా నామం ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను, అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,
- అపొస్తలుల కార్యములు 15:18సుమారు క్రీ.శ. 51
చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’
- అపొస్తలుల కార్యములు 15:19సుమారు క్రీ.శ. 51
“కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న యూదేతరులకు మనం కష్టంగా ఉండేలా చేయకూడదనేది నా తీర్పు.
- అపొస్తలుల కార్యములు 15:20సుమారు క్రీ.శ. 51
దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి.
- అపొస్తలుల కార్యములు 15:21సుమారు క్రీ.శ. 51
ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 15:22సుమారు క్రీ.శ. 51
ఆ తర్వాత అపొస్తలులు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా సీలను ఏర్పరచుకున్నారు.
- అపొస్తలుల కార్యములు 15:23సుమారు క్రీ.శ. 51
వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు: అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు, అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు, శుభములు.
- అపొస్తలుల కార్యములు 15:24సుమారు క్రీ.శ. 51
మా నుండి అనుమతి పొందకుండానే మాలో నుండి కొందరు మీ దగ్గరకు వచ్చి వారు మీతో చెప్పే బోధలతో మిమ్మల్ని కలవరపరుస్తూ, మీ మనస్సులను ఇబ్బంది పెడుతున్నారని మేము విన్నాము.
- అపొస్తలుల కార్యములు 15:25సుమారు క్రీ.శ. 51
కాబట్టి మా నుండి కొంతమందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా పౌలుతో వారిని పంపడానికి మేము అందరం అంగీకరించాము.
- అపొస్తలుల కార్యములు 15:26సుమారు క్రీ.శ. 51
మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు.
- అపొస్తలుల కార్యములు 15:27సుమారు క్రీ.శ. 51
మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము.
- అపొస్తలుల కార్యములు 15:28సుమారు క్రీ.శ. 51
వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:
- అపొస్తలుల కార్యములు 15:29సుమారు క్రీ.శ. 51
విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.
- అపొస్తలుల కార్యములు 15:30సుమారు క్రీ.శ. 51
వారు పంపబడిన తర్వాత వారు అక్కడినుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు.
- అపొస్తలుల కార్యములు 15:31సుమారు క్రీ.శ. 51
వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు.