కంటెంట్‌కు వెళ్లండి

Egypt

561 verses · 4 known names

ఇలా కూడా పిలుస్తారు: Egyptian, Egyptians, Egyptian's

30.1000, 31.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Egypt ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవిస్తూ, ఈజిప్టులో నుండి నేను వారిని బయటకు రప్పించిన రోజు నుండి ఇప్పటివరకు అలాగే చేశారు. నీ పట్ల కూడా అలాగే చేస్తున్నారు.

  2. వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’

  3. అప్పుడు సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు, “మోషేను అహరోనును నియమించి మీ పూర్వికులను ఈజిప్టు దేశంలో నుండి తీసుకువచ్చింది యెహోవాయే గదా.

  4. “యాకోబు ఈజిప్టుకు వచ్చిన తర్వాత, వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే అహరోనులను పంపారు. వారు మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి ఈ స్థలంలో స్థిరపరిచారు.

  5. సైన్యాల యెహోవా చెప్పింది ఇదే, ‘ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు దారిలో వారిని అడ్డగించినందుకు నేను వారిని శిక్షిస్తాను.

  6. అప్పుడు సౌలు కెనీయులతో, “ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు మీరు వారందరి పట్ల దయ చూపించారు కాబట్టి నేను అమాలేకీయులతో పాటు మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు అమాలేకీయులను విడిచిపెట్టి వెళ్లిపొండి” అని చెప్పినప్పుడు కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయారు.

  7. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఈజిప్టు దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్న షూరు వరకు తరిమి చంపి,

  8. తర్వాత దావీదు అతని మనుష్యులు బయలుదేరి గెషూరీయులమీద గెజెరీయులమీద, అమాలేకీయుల మీద దాడి చేశారు. (పూర్వం నుండి ఈ ప్రజలు షూరు, ఈజిప్టు వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో నివసించారు.)

  9. అప్పుడు దావీదు, “నీది ఏ దేశం? ఎక్కడ నుండి వచ్చావు?” అని అతన్ని అడిగాడు. అందుకు అతడు, “ఈజిప్టుకు చెందిన నేను ఒక అమాలేకీయునికి బానిసను. మూడు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేదని నా యజమాని నన్ను వదిలేశాడు.

  10. ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.

  11. మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.

  12. సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు.

  13. సొలొమోను యూఫ్రటీసు నది నుండి ఫిలిష్తీయ దేశం, ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ దేశ ప్రజలు సొలొమోనుకు పన్ను చెల్లిస్తూ, అతడు బ్రతికి ఉన్నంత కాలం అతనికి సేవ చేస్తూ ఉన్నారు.

  14. సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది.

  15. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.

  16. మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.

  17. ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, కాని నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’

  18. యెహోవా మన పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పుడు, ఆయన వారితో చేసిన నిబంధనను తెలిపే మందసం కోసం మందిరంలో స్థలం ఏర్పాటు చేశాను.”

  19. ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు.

  20. ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”

  21. అప్పుడు ప్రజలు, ‘వారు తమ పూర్వికులను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”

  22. (ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు.

  23. సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.

  24. వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని, ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి, సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.

  25. అయితే అప్పుడు హదదు చిన్నవాడు, అతడు తన తండ్రి సేవకులైన కొంతమంది ఎదోమీయుల అధికారులతో ఈజిప్టుకు పారిపోయాడు.