God
God ను ప్రస్తావించే వచనాలు
దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి.
వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి.
వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు.
కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు.
వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.
అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు.
అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు.
నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు;
ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.
అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు.
కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా?
దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా?
అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్నిబట్టి దేవుని న్యాయమైన తీర్పు తీర్చబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను మీకు మీరే పోగు చేసుకుంటున్నారు.
ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు.
ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు.
నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.
ఒకవేళ మిమ్మల్ని మీరు యూదులుగా పిలుచుకుంటూ, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవునిలో అతిశయిస్తున్నట్లయితే;
ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా?
“నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది.
అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.
ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.
వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా?
ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”
అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను.
ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు?