Skip to content
నెహెమ్యా 11:20-36

నెహెమ్యా 11:20-36

20
మిగిలిన ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు యూదా పట్టణాల్లో తమకు కేటాయించిన స్వాస్థ్యంలో నివసించారు.
21
ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు.
22
యెరూషలేములోని లేవీయులకు ఉజ్జీ అధికారి; ఇతడు మీకా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన హషబ్యా కుమారుడైన బానీ కుమారుడు. దేవుని ఆలయ సేవల బాధ్యత వహించిన సంగీతకారులైన ఆసాపు వారసులలో ఒకడు ఉజ్జీ.
23
సంగీతకారులు రాజు ఆదేశాల ప్రకారం పని చేయాలి, కాబట్టి వారి దినచర్య క్రమబద్ధం చేయబడింది.
24
యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు.
25
ఇక గ్రామాలు వాటి పొలాలకు సంబంధించి యూదా ప్రజల్లో కొంతమంది కిర్యత్-అర్బాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, దీబోనులో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, యెకబ్సెయేలులో దాని గ్రామాల్లో,
26
యెషూవలో, మొలాదాలో, బేత్-పెలెతులో,
27
హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
28
సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో,
29
ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో,
30
జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.
31
గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
32
అనాతోతులో, నోబులో, అనన్యాలో,
33
హాసోరులో, రామాలో, గిత్తయీములో,
34
హదీదులో, సెబోయిములో, నెబల్లాటులో,
35
లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
36
యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options