జెరుబ్బాబెలుతో తిరిగి వచ్చిన యాజకులు మరియు లేవీయులు
1
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే: శెరాయా, యిర్మీయా, ఎజ్రా,
2
అమర్యా, మల్లూకు, హట్టూషు,
3
షెకన్యా, రెహూము, మెరేమోతు,
4
ఇద్దో, గిన్నెతోయి, అబీయా,
5
మీయామిను, మయద్యా, బిల్గా,
6
షెమయా, యోయారీబు, యెదాయా,
7
సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా.
8
లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా కృతజ్ఞత పాటలకు నాయకత్వం వహించే మత్తన్యా అతని సహాయకులు.
9
పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.