కంటెంట్‌కు వెళ్లండి

Young Men గురించి బైబిల్ వచనాలు

347 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి.

  2. అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది.

  3. (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు;

  4. అది వీధుల్లో తిరుగుతుంది, ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.)

  5. అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది:

  6. “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.

  7. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!

  8. నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన రంగుల నార దుప్పట్లు పరిచాను.

  9. నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను.

  10. తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం!

  11. నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు.

  12. అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.”

  13. ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.

  14. అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,

  15. తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.

  16. కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.

  17. వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.

  18. అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; అది పడద్రోసిన వారు అనేకులు.

  19. దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.

  20. సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.

  21. జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.

  22. మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.

  23. జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు, కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు.

  24. వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.

  25. బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు.