Skip to content

Wives గురించి బైబిల్ వచనాలు

73 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”

  2. నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.

  3. ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.

  4. ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.

  5. ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు.

  6. ఆ స్త్రీ తన భర్త దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “ఆ రోజు నాకూ ప్రత్యక్షమైన వ్యక్తి మళ్ళీ కనిపించాడు” అని చెప్పింది.

  7. నాల్గవ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”

  8. అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”

  9. విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.

  10. వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత,

  11. అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక.

  12. అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.

  13. యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.

  14. (తన భార్య యెజెబెలు ప్రేరేపణకు లొంగిపోయి యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తనను తానే అమ్ముకున్న అహాబులాంటి వారు ముందెన్నడూ ఎవ్వడూ లేరు.

  15. రాజు దగ్గరకు వెళ్లడానికి ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు (ఈమె మొర్దెకై పినతండ్రి అబీహయిలు కుమార్తె, మొర్దెకై ఈమెను దత్తత తీసుకున్నాడు), ఆమె రాజు యొక్క నపుంసకుడు, అంతఃపురం యొక్క అధికారియైన హేగై ప్రతిపాదించింది తప్ప మరి ఏవి అడగలేదు. ఎస్తేరును చూసిన వారందరికి ఆమె అంటే ఇష్టం కలిగింది.

  16. అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.

  17. రాజు ఇతర స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువ ప్రేమించాడు, ఆమె ఇతర కన్యకలందరికంటే రాజు దయను, ఆమోదాన్ని పొందుకుంది. కాబట్టి అతడు ఆమె తలమీద రాజ కిరీటం పెట్టి, వష్తి స్థానంలో ఎస్తేరును రాణిగా నియమించాడు.

  18. అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.

  19. అతని భార్య వచ్చి, “నీవు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని శపించి చనిపోవచ్చు కదా!” అని అన్నది.

  20. మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.

  21. భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.

  22. ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.

  23. గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.

  24. ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు.

  25. ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.