Skip to content

Window గురించి బైబిల్ వచనాలు

27 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దానికి పైకప్పు వేసి, మూర కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి.

  2. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.

  3. రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది.

  4. అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది. వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది.

  5. అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు.

  6. కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.

  7. తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.

  8. ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా.

  9. అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది.

  10. అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.

  11. దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.

  12. వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి.

  13. తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.

  14. అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.

  15. వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.

  16. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి.

  17. అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.

  18. అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.

  19. దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.

  20. లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు.

  21. దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.

  22. అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.

  23. దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.

  24. దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.

  25. అప్పుడతడు నన్ను ఉత్తర ద్వారం దగ్గరికి తీసుకువచ్చి దానిని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.