Skip to content

War గురించి బైబిల్ వచనాలు

639 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించి, వారు నాశనం చేయబడేవరకు, వారికి గొప్ప కలవరాన్ని పుట్టిస్తారు.

  2. ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తారు. మీరు వారి పేర్లను ఆకాశం క్రిందనుండి తుడిచివేస్తారు. మీకు విరోధంగా ఎవరు నిలువలేరు; మీరు వారిని నాశనం చేస్తారు.

  3. మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.

  4. శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”

  5. మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగిస్తే, దానిలో ఉన్న మనుష్యులందరిని ఖడ్గంతో హతమార్చాలి.

  6. స్త్రీలను, చిన్న పిల్లలను పశువులను మీరు కొల్లగొట్టిన ఆస్తిని మీరు తీసుకోవచ్చు; మీ దేవుడైన యెహోవా మీకిచ్చే మీ శత్రువుల దోపుడుసొమ్ము మీదే అవుతుంది.

  7. మీకు దూరంగా ఉన్న సమీపంలోని దేశాలకు చెందని అన్ని పట్టణాల పట్ల మీరు ఈ విధంగా వ్యవహరిస్తారు.

  8. యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే పట్టణాల్లో ఊపిరి పీల్చేదేదీ మిగలకూడదు.

  9. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞమేరకు హిత్తీయులను, అమోరీయులను కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను పూర్తిగా నాశనం చేయాలి.

  10. లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.

  11. మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది.

  12. మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు.

  13. యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు.

  14. యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు.

  15. మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.

  16. మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు.

  17. మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు.

  18. మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు.

  19. మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.

  20. మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి.

  21. యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి.

  22. మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు.

  23. యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.

  24. మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు.

  25. మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి.