కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of Saints గురించి బైబిల్ వచనాలు

122 వచనాలు · 81 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.

  2. మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.”

  3. మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,

  4. మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.

  5. “ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.

  6. మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు,

  7. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.

  8. ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.

  9. దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.

  10. ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”

  11. O ye seed of Israel his servant, ye children of Jacob, his chosen ones.

  12. మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా?

  13. యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.

  14. సంగీత దర్శకునికి. షెమినీతు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.

  15. భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”

  16. “యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.

  17. నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని.

  18. O ye seed of Abraham his servant, ye children of Jacob his chosen.

  19. యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.

  20. ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.

  21. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.

  22. యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.

  23. గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.

  24. మీరు బెదరకండి, భయపడకండి. చాలా కాలం క్రితం నేను ఈ విషయం చెప్పి మీకు ప్రకటించలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప, ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్లు నేనెరుగను.”

  25. యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.