కంటెంట్‌కు వెళ్లండి

The Edomites గురించి బైబిల్ వచనాలు: Punishment for persecuting Israel

8 వచనాలు · 62 కోణాలు

"The Edomites" కోసం వెతకండి

Punishment for persecuting Israel గురించి వచనాలు

  1. ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది; చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి, నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది.

  2. యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.

  3. వాటితో పాటు అడవి ఎద్దులు, కోడెలు, బలమైన ఎద్దులు చస్తాయి. వారి భూమి రక్తంతో తడుస్తుంది. వారి మట్టి క్రొవ్వులో నానుతుంది.

  4. యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.

  5. రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”

  6. నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా ఎర్రగా ఎందుకు ఉన్నాయి?

  7. “నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను; దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు. నా కోపంలో వారిని త్రొక్కివేశాను నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను; వారి రక్తం నా బట్టలమీద చిందింది, నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.

  8. అది నేను పగతీర్చుకునే రోజు; నేను విమోచించే సంవత్సరం వచ్చింది.