Skip to content

Pharaoh

9 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Pharaoh ను ప్రస్తావించే వచనాలు

  1. సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు.

  2. (ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు.

  3. రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు.

  4. వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.

  5. ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు.

  6. తహ్పెనేసు సోదరికి హదదుకు గెనుబతు అనే కుమారుడు పుట్టాడు. తహ్పెనేసు రాజభవనంలో అతన్ని పెంచింది. గెనుబతు ఫరో సొంత పిల్లలతో కలిసి పెరిగాడు.

  7. దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడని, అతని సేనాధిపతియైన యోవాబు కూడా చనిపోయాడని హదదు ఈజిప్టులో ఉన్నప్పుడు విన్నాడు. అప్పుడు హదదు ఫరోతో, “నా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నన్ను అనుమతించండి” అన్నాడు.

  8. అందుకు ఫరో, “నా దగ్గర నీకేం తక్కువైందని నీవు నీ స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నావు?” అని అడిగాడు. అందుకు హదదు, “ఏమీ తక్కువ కాలేదు కాని దయచేసి మీరు నన్ను వెళ్లనివ్వండి” అన్నాడు.

  9. సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.