Skip to content

Temptation గురించి బైబిల్ వచనాలు

346 వచనాలు · 52 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక, ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక.

  2. ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది, ఒక శిక్షించవలసిన పాపము.

  3. అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని; అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది.

  4. “ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా, ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు, నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే,

  5. దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను? లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?

  6. గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?

  7. “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,

  8. ఒకవేళ అనాధలకు పెట్టకుండా నేనే ఒంటరిగా భోజనం చేసినా

  9. ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,

  10. నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,

  11. నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,

  12. అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.

  13. దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.

  14. “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,

  15. ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి, నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,

  16. నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,

  17. నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,

  18. అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.

  19. “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,

  20. వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా నా నోటిని పాపానికి అనుమతించలేదు

  21. ‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’ అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా

  22. ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు, ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది

  23. మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ, నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?

  24. నేను గుంపులకు భయపడి గాని వంశాల ధిక్కారానికి బెదిరిపోయి గాని నేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా?

  25. “నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,