Surety గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను.
నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.
ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.
మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు.
బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.
పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు.
సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.
నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు, కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి: వెళ్లి అలసిపోయేవరకు, నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!
నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.
వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా, బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.
ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.
బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.
అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;
అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.
పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. దోపిడీలు చేస్తాడు. అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. అతడు విగ్రహాలవైపు చూస్తాడు. అసహ్యమైన పనులు చేస్తాడు.
వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు.
తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు.