Seraiah గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; శెరాయా కార్యదర్శి.
షెవా కార్యదర్శి; సాదోకు అబ్యాతారులు యాజకులు;
షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి;
బబులోను రాజు గెదల్యాను అధికారిగా నియమించాడని సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విని, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారుడైన యోహానాను, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మయకాతీయుని కుమారుడైన యాజన్యా వారి మనుష్యులు వచ్చారు.
కెనజు కుమారులు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలు కుమారులు: హతతు, మెయానొతై.
మెయానొతై ఒఫ్రాకు తండ్రి. శెరాయా యోవాబుకు తండ్రి, యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.
యోవేలు; అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడు యెహు;
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; షవ్షా కార్యదర్శి;
శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు;
పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.
నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు.
యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు.
అప్పుడు యిర్మీయా శెరాయాతో, “మీరు బబులోనుకు చేరుకున్నప్పుడు, ఈ మాటలన్నీ బిగ్గరగా చదివి వినిపించు.