Skip to content

Kareah

14 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Careah

Kareah ను ప్రస్తావించే వచనాలు

  1. బబులోను రాజు గెదల్యాను అధికారిగా నియమించాడని సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విని, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారుడైన యోహానాను, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మయకాతీయుని కుమారుడైన యాజన్యా వారి మనుష్యులు వచ్చారు.

  2. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు.

  3. కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చి,

  4. అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడుతూ, “నేను వెళ్లి ఎవరికీ తెలియకుండా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపుతాను. అతడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయాలి, అలా చేసి, నీ చుట్టూ ఉన్న యూదులందరు చెదిరిపోయేలా, యూదా వారిలో మిగిలినవారు నాశనమయ్యేలా ఎందుకు చేయాలి?”

  5. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడు యోహానానుతో, “అలాంటి పని చేయకు! ఇష్మాయేలు గురించి మీరు చెప్పేది నిజం కాదు” అన్నాడు.

  6. కారేహ కుమారుడైన యోహానాను, అతనితో ఉన్న సైన్య అధికారులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన నేరాల గురించి విని,

  7. ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు.

  8. మిస్పాలో ఇష్మాయేలు బందీలుగా పట్టుకున్న ప్రజలంతా తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లారు.

  9. అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు.

  10. అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ,

  11. కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు.

  12. హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.

  13. కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.

  14. అందుకు బదులుగా, కారేహ కుమారుడైన యోహానాను సైన్య అధికారులందరూ ఆయా దేశాలకు పారిపోయి యూదా దేశానికి తిరిగివచ్చిన మిగిలి ఉన్న యూదా ప్రజలందరిని తీసుకెళ్లారు.