Skip to content

Rome గురించి బైబిల్ వచనాలు: Christians in:

22 వచనాలు · 5 కోణాలు

Christians in: గురించి వచనాలు

  1. అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.

  2. మీ కోసం ఎంతో కష్టపడిన మరియకు వందనాలు తెలియజేయండి.

  3. నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు.

  4. ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి.

  5. క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి.

  6. క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి. అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వారికి వందనాలు తెలియజేయండి.

  7. నా తోటి యూదుడైన హెరోదియోనుకు వందనాలు తెలియజేయండి. నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి.

  8. ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి. ప్రభువులో ఎంతో కష్టపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి.

  9. ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే.

  10. అసుంక్రితు, ప్లెగోను, హెర్మెసు, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి.

  11. పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.

  12. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి. క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి.

  13. సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించమని వేడుకుంటున్నాను. వారికి దూరంగా ఉండండి.

  14. సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

  15. దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది.

  16. నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

  17. కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు.

  18. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు.

  19. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు.

  20. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను.

  21. ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు ముఖ్యంగా కైసరు కుటుంబానికి చెందినవారు మీకు వందనాలు చెప్తున్నారు.

  22. శీతాకాలం రాకముందే నీవు ఇక్కడకు రావడానికి ప్రయత్నించు. యుబూలు నీకు వందనాలు తెలియజేయమన్నాడు, అలాగే పూదే, లీను, క్లౌదియ, ఇక్కడి విశ్వాసులైన సహోదరి సహోదరులందరు తమ వందనాలు నీకు తెలియజేస్తున్నారు.