కంటెంట్‌కు వెళ్లండి

Religious Zeal గురించి బైబిల్ వచనాలు

726 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను ఇలా ఆలోచించి అస్థిరంగా నడుచుకున్నానా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? ఔను ఔనని చెప్తూ కాదు కాదని చెప్తున్నానా?

  2. అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు.

  3. ఎందుకంటే సీల ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు.

  4. అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచి ఉన్నారు. కాబట్టి మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కోసం మీ తోటిపనివారిగా పనిచేస్తున్నాము.

  5. క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.

  6. కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.

  7. కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.

  8. ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము.

  9. ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు?

  10. మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.

  11. వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.

  12. కాబట్టి, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము.

  13. దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగి ఉన్నాము, కాబట్టి మేము ధైర్యాన్ని కోల్పోము.

  14. అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.

  15. ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము.

  16. మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు;

  17. హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.

  18. మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము.

  19. మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.

  20. కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది.

  21. “నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడాను” అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాము.

  22. ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు తన ఎదుట నిలబెడతారని మాకు తెలుసు.

  23. ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.

  24. కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.

  25. మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.