Procrastination గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు.
“మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.
మీరు మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే, దానిని తీర్చడానికి ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా మీ నుండి దాన్ని కోరతారు, మీరు పాపాన్ని బట్టి దోషులవుతారు.
“ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.
ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,
“మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.
మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.
రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.
నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు.
కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.
చీకటి కమ్ముతున్న కొండలమీద మీ పాదాలు తడబడక ముందే, మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి. మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు, కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా గాఢమైన చీకటిగా మారుస్తారు.
యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు.
వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు.
“మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి?
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు, ‘అతడు చూసే దర్శనం నెరవేరడానికి చాలా సంవత్సరాల పడుతుంది, అతడు చాలా కాలం తర్వాత భవిష్యత్తులో జరిగే వాటి గురించి ప్రవచిస్తున్నాడు’ అని అంటున్నారు.
“కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
“మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.
ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు” అని అన్నాడు.
కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,
తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.
అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు.
అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు.