Skip to content

Poor గురించి బైబిల్ వచనాలు

203 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.

  2. నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.

  3. ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.

  4. న్యాయం చేసేటప్పుడు పేదవారైనా సరే వారిపట్ల పక్షపాతం చూపకూడదు.

  5. “న్యాయవిషయంలో పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు.

  6. ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.

  7. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మీరు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతులు అర షెకెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవారు అర షెకెల్ కన్నా తక్కువ ఇవ్వకూడదు.

  8. “ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము.

  9. ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”

  10. “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,

  11. రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను, వారి స్థోమతను బట్టి ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసం తీసుకురావాలి.

  12. “ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు.

  13. మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  14. “ ‘తీర్పును వక్రీకరించకండి; బీదవారికి పక్షపాతం చూపకూడదు లేదా గొప్పవారిని అభిమానం చూపకూడదు, కాని మీ పొరుగువారికి న్యాయమైన తీర్పు తీర్చండి.

  15. “ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం అంచుల మట్టుకు కోయకండి లేదా మీ పంట కోతలను సేకరించకండి. పేదల కోసం, మీ మధ్య నివసించే విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

  16. “ ‘ఒకవేళ మీ తోటి ఇశ్రాయేలీయులలో ఒకరు పేదవారిగా మారి వారి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మితే, వారి అతి సమీపబంధువు వచ్చి వారు అమ్మిన వాటిని తిరిగి విడిపించాలి.

  17. ఒకవేళ, వారి కోసం దానిని విడిపించడానికి సమీపబంధువు ఎవరు లేకపోతే, కాని తర్వాత వారు వృద్ధి చెంది దానిని విడిపించుకోడానికి తగినంత సంపాదిస్తే,

  18. వారు దాన్ని కొన్నప్పటి నుండి వారు విలువను నిర్ణయించి, బకాయిలను వారు ఎవరికి అమ్మారో వారికి తిరిగి చెల్లించాలి; వారు తిరిగి వారి సొంత ఆస్తికి వెళ్లవచ్చు.

  19. ఆస్తి మళ్ళీ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు వారికి దొరక్కపోతే, వారు అమ్మిన ఆస్తి యాభైయవ వార్షికోత్సవం వరకు కొన్న వారి స్వాధీనమవుతుంది. యాభైయవ వార్షికోత్సవంలో అది వారికి తిరిగి ఇవ్వబడుతుంది, వారు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్లవచ్చు.

  20. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.

  21. వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.

  22. మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.

  23. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.

  24. వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.

  25. అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు.