Months గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.
నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి.
ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది.
లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు. ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత,
అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు.
అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”
అయితే ఈ ఒక్క కోరిక తీర్చు. నేను ఇక పెళ్ళి చేసుకోను, కాబట్టి రెండు నెలలు నా స్నేహితులతో కొండల్లో సంచరిస్తూ ప్రలాపించనివ్వు.”
యెహోవా మందసం ఏడు నెలలు ఫిలిష్తీయుల స్థావరంలో ఉన్న తర్వాత,
సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు.
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.
నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు.
పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.
మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.
రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
ఈ బెనాయా పరాక్రమశాలి, ముప్పైమంది వీరులలో ఒకనిగా, ఆ ముప్పైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడైన అమ్మీజాబాదు అతని విభాగంలో అధిపతిగా ఉన్నాడు.
నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
అయిదవ నెలకు ఇశ్రాహేతీయుడైన షంహూతు అయిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
ఆరవ నెలకు తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, ఆరవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
ఏడవ నెలకు ఎఫ్రాయిమీయుడు పెలోనీయుడైన హేలెస్సు ఏడవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
తొమ్మిదవ నెలకు బెన్యామీనీయుడు అనాతోతీయుడైన అబీయెజెరు తొమ్మిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
పదవ నెలకు జెరహీయుడు, నెటోపాతీయుడైన మహరై పదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.