Skip to content

Joab గురించి బైబిల్ వచనాలు

10 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.

  2. యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు.

  3. అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.

  4. అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.

  5. ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.

  6. యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.

  7. అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

  8. యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు అంతటిలో కత్తి తిప్పగలవారు పదకొండు లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో నాలుగు లక్షల డెబ్బైవేలమంది ఉన్నారు.

  9. ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా వాగ్దానం చేశారు, కాబట్టి ఇరవై సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయస్సున్న వారిని దావీదు లెక్కించలేదు.

  10. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.