కంటెంట్‌కు వెళ్లండి

Homicide గురించి బైబిల్ వచనాలు

44 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ పట్టణాలు ఇవి: రూబేనీయులకు అరణ్య పీఠభూమిలో ఉన్న బేసెరు; గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు; మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.

  2. మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి.

  3. మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.

  4. మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు.

  5. ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.

  6. ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.

  7. అందువల్లనే మూడు పట్టణాలను మీరు ఎంచుకోవాలని ఆజ్ఞాపించాను.

  8. మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ సరిహద్దులను విశాలపరచి వారికి వాగ్దానం చేసిన దేశమంతటిని మీకు ఇస్తే,

  9. నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ చట్టాలన్నిటిని మీరు జాగ్రత్తగా అనుసరించి అనగా మీ దేవుడనైన యెహోవాను ప్రేమిస్తూ, నిత్యం ఆయన పట్ల విధేయత కలిగి మీరు నడుస్తూ, మరో మూడు పట్టణాలు ప్రత్యేకించాల్సి ఉంటుంది.

  10. మీ దేవుడైన యెహోవా నీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషి రక్తం చిందించబడకుండ, మీరు రక్తపాతానికి పాల్పడకుండ ఉండడానికి ఇలా చేయండి.

  11. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు:

  12. “నేను మోషే ద్వారా మీకు సూచించినట్లు ఆశ్రయ పట్టణాలను నియమించమని ఇశ్రాయేలీయులకు చెప్పు,

  13. తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు.

  14. వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి.

  15. హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు.

  16. వారు సమాజం ముందు విచారణ జరిగే వరకు, ఆ సమయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. తర్వాత వారు తాము పారిపోయి వచ్చిన పట్టణంలోని తమ సొంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.”

  17. కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు.

  18. యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.

  19. ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు.