కంటెంట్‌కు వెళ్లండి

Government గురించి బైబిల్ వచనాలు

62 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ ఊరిపెద్దలను పట్టుకుని ఎడారి ముళ్ళతో, ముళ్ళపొదలతో శిక్షించి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు.

  2. And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob:

  3. యెఫ్తాతో వారు, “రా, వచ్చి మా దళాధిపతిగా ఉండు, అప్పుడు మేము అమ్మోనీయులతో పోరాడగలం” అన్నారు.

  4. యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”

  5. గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.

  6. యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.

  7. అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

  8. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.

  9. బోయజు ఆ పట్టణ పెద్దలలో పదిమందిని తీసుకుని వచ్చి, “ఇక్కడ కూర్చోండి” అని చెప్పాడు, వారు కూర్చున్నారు.

  10. అతడు ఆ బంధువుతో అన్నాడు, “మోయాబు నుండి తిరిగివచ్చిన నయోమి, మన బంధువైన ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మి వేస్తుంది.

  11. ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని, నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను. నీవు విడిపిస్తే విడిపించు. కాని ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు, నీ తర్వాత నేను ఉన్నాను.” “నేను విడిపిస్తాను” అని అతడు అన్నాడు.

  12. అప్పుడు బోయజు అన్నాడు, “నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు, చనిపోయిన వాని భార్య, మోయాబీయురాలైన రూతు నీకు చెందుతుంది, ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతిని నిలబెడతావు.”

  13. ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.

  14. (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)

  15. కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.

  16. అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.

  17. అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”

  18. అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.

  19. కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది.

  20. ఆ ఉత్తర్వులలో ఆమె ఇలా వ్రాసింది: “ఉపవాస దినం ఒకటి ప్రకటించి నాబోతును ప్రజలమధ్య ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టండి.

  21. అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.”

  22. యెజెబెలు తమకు పంపిన ఆ ఉత్తర్వులలో వ్రాసిన దాని ప్రకారం నాబోతు పట్టణంలో ఉన్న పెద్దలు, సంస్థానాధిపతులు చేశారు.

  23. వారు ఉపవాసం ప్రకటించి నాబోతును ప్రజల ఎదుట ప్రముఖ స్థలంలో కూర్చోబెట్టారు.

  24. అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.

  25. “నాబోతు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు” అని యెజెబెలుకు వారు కబురు పంపారు.