Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఈ రోజున మీరు ఆయన ప్రజలని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన స్వంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ప్రకటించారు.

  2. ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.

  3. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు.

  4. అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.

  5. యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.

  6. ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.

  7. As an eagle stirreth up her nest, fluttereth over her young, spreadeth abroad her wings, taketh them, beareth them on her wings:

  8. యెహోవా ఒక్కడే అతన్ని నడిపించారు; ఏ ఇతర దేవుడు అతనితో ఉండలేదు.

  9. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.

  10. నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.

  11. మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.

  12. మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.

  13. ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.

  14. మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.

  15. ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు.

  16. “కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక.

  17. ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”

  18. అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:

  19. ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు.

  20. అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’

  21. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.

  22. కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.

  23. అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.

  24. “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.

  25. యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను తెలిపే మందసాన్ని మందిరంలో అక్కడ పెట్టాను.”