Skip to content

Esau గురించి బైబిల్ వచనాలు

47 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను.

  2. ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు.

  3. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.

  4. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.

  5. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.

  6. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.

  7. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.

  8. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.

  9. బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.

  10. హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు,

  11. ఒహోలీబామా, ఏలహు, పీనోను,

  12. కనజు, తేమాను, మిబ్సారు,

  13. మగ్దీయేలు, ఈరాము.

  14. “ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా?

  15. తేమానూ! నీ వీరులు భయపడతారు, ఏశావు పర్వతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, సంహరించబడి కూలిపోతారు.

  16. నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు.

  17. అపరిచితులు అతని ఆస్తులను తీసుకెళ్లినప్పుడు, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి, యెరూషలేము మీద చీట్లు వేసేిన రోజున, నీవు దూరంగా నిలబడ్డావు, నీవు వారిలో ఒకనిగా ఉన్నావు.

  18. నీ సోదరునికి దురవస్థ కలిగిన రోజు, నీవు సంతోషించకూడదు, యూదా ప్రజల నాశన దినాన వారిని చూసి ఆనందించకూడదు, వారి శ్రమ దినాన, నీవు గొప్పలు చెప్పుకోవద్దు.

  19. నా ప్రజలకు ఆపద సంభవించిన రోజున వారి గుమ్మాల్లో చొరబడకూడదు, వారికి ఆపద కలిగిన రోజున, వారికి వచ్చిన విపత్తును బట్టి సంతోషించకూడదు, వారికి ఆపద వచ్చిన రోజున వారి ఆస్తులను దోచుకోకూడదు.

  20. వారిలో తప్పించుక పోయేవారిని చంపడానికి నీవు కూడలిలో ఎదురుచూస్తూ నిలబడకూడదు, వారి శ్రమ దినాన వారిలో మిగిలే వారిని శత్రువులకు అప్పగించకూడదు.

  21. యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు.

  22. దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు.