కంటెంట్‌కు వెళ్లండి

Egypt గురించి బైబిల్ వచనాలు

328 వచనాలు · 105 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.

  2. ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:

  3. “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.

  4. గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!

  5. నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  6. “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

  7. “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?

  8. ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.

  9. గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.

  10. అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.

  11. “కన్యయైన ఈజిప్టు కుమారీ, గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; నీకు స్వస్థత కలుగదు.

  12. దేశాలు నీ అవమానం గురించి వింటాయి; నీ కేకలు భూమంతటా వినబడతాయి. యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”

  13. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది.

  14. ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. “ ‘నైలు నది నాది నేనే దానిని చేశానని నీవు అన్నావు కాబట్టి,

  15. నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను.

  16. దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు.

  17. నిర్మానుష్యమైన దేశాల మధ్య ఈజిప్టు దేశం పాడైపోతుంది. శిథిలమై పోయిన పట్టణాల మధ్య దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడైపోయి ఉంటాయి. ఈజిప్టువారిని ఇతర ప్రజలమధ్య చెదరగొడతాను. వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.

  18. “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.

  19. కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.

  20. అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  21. పత్రూసు పాడుచేస్తాను, సోయనులో అగ్ని పుట్టిస్తాను తేబేసుకు శిక్ష విధిస్తాను.

  22. ఈజిప్టుకు కోటయైన సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.

  23. ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.

  24. హెలియోపొలిస్, పీ-బెసెతు యువకులు కత్తివేటుకు కూలిపోతారు, ఆ పట్టణస్థులు బందీలవుతారు.

  25. ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; దాని బల గర్వం అణచివేయబడుతుంది. దానిని మబ్బులు క్రమ్ముతాయి దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.