Skip to content

Constitution గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి.

  2. అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు,

  3. తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.

  4. వారు వెళ్లి యూదా అంతటా తిరుగుతూ అన్ని పట్టణాల నుండి లేవీయులను, ఇశ్రాయేలు కుటుంబాల నాయకులను సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చినప్పుడు,

  5. సమాజమంతా దేవుని మందిరంలో రాజుతో ఒక నిబంధన చేశారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు: “దావీదు వంశస్థుల విషయంలో యెహోవా వాగ్దానం చేసినట్లుగా రాజు కుమారుడు పరిపాలన చేయాలి.

  6. సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది.

  7. ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు.

  8. కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు.

  9. అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.

  10. కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు. రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు.

  11. అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.”

  12. ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు.

  13. అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు.