Skip to content

Cloud గురించి బైబిల్ వచనాలు: Pillar of

38 వచనాలు · 4 కోణాలు

Pillar of గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు పగలు రాత్రి ప్రయాణం చేయగలిగేలా యెహోవా పగటివేళ మేఘస్తంభంలో రాత్రివేళ వారికి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచారు.

  2. పగటివేళ మేఘస్తంభం గాని, రాత్రివేళ అగ్నిస్తంభం గాని ప్రజల ఎదుట నుండి వాటి స్థలం వదిలిపోలేదు.

  3. దేవుని మహిమ సీనాయి పర్వతంమీద నిలిచింది. ఆరు రోజులు మేఘం దానిని కమ్ముకుని ఉంది. ఏడవ రోజు యెహోవా ఆ మేఘంలోనుండి మోషేను పిలిచారు.

  4. ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ ఆ పర్వతం మీద దహించే అగ్నిలా కనిపించింది.

  5. మోషే పర్వతం పైకి ఎక్కి వెళ్లి ఆ మేఘంలోకి ప్రవేశించాడు. అతడు ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాడు.

  6. మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు.

  7. ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు.

  8. ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో, సమావేశ గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు వారు బయలుదేరేవారు.

  9. ఒకవేళ మేఘం పైకి వెళ్లకపోతే, అది పైకి వెళ్లేవరకు బయలుదేరేవారు కారు.

  10. ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో ఇశ్రాయేలీయులంతా చూస్తూ ఉండగా పగటివేళ యెహోవా మేఘం సమావేశ గుడారం మీద ఉండేది, రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది.

  11. నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.

  12. అది నిత్యం అలాగే ఉంది; మేఘం దాన్ని కమ్మింది, రాత్రివేళ ఆ మేఘం అగ్నిలా కనిపించేది.

  13. గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు, ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు; ఎక్కడ మేఘం ఆగితే వారు అక్కడ గుడారాలు వేసుకునేవారు.

  14. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉండేవారు. మేఘం సమావేశ గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వారు శిబిరంలో ఉండేవారు.

  15. మేఘం ఎక్కువకాలం సమావేశ గుడారం మీద ఆగితే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు కారు.

  16. కొన్నిసార్లు మేఘం సమావేశ గుడారానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది; యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు శిబిరం చేస్తారు, ఆయన ఆజ్ఞ ప్రకారం వారు ప్రయాణం చేస్తారు.

  17. కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉండేది, ఉదయం ఎత్తినప్పుడు, వారు ప్రయాణించేవారు. పగలైన, రాత్రైనా, మేఘం ఎత్తినప్పుడల్లా వారు ప్రయాణించేవారు.

  18. మేఘం సమావేశ గుడారంలో రెండు రోజులు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం పాటు ఉండిపోతే, ఇశ్రాయేలీయులు శిబిరంలోనే ఉండేవారు; కానీ అది ఎత్తినప్పుడు, వారు బయలుదేరేవారు.

  19. యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు గుడారాలు వేసుకునేవారు, యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు బయలుదేరేవారు. మోషే ద్వారా ఇవ్వబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు లోబడ్డారు.

  20. రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవయ్యవ రోజున, మేఘం సాక్షి గుడారం మీది నుండి కదిలింది.

  21. ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు.

  22. కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది.

  23. వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది.

  24. మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.

  25. మందసం ఆగినప్పుడు, అతడు, “యెహోవా, లెక్కలేనంతగా ఉన్న వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి” అని అనేవాడు.