Skip to content

Aliens గురించి బైబిల్ వచనాలు

39 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు.

  2. విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.

  3. వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.

  4. సొలొమోను ఇశ్రాయేలులో ఉంటున్న పరాయి దేశస్థుల జనాభా లెక్కలు తీయించాడు. తన తండ్రియైన దావీదు చేయించిన లెక్కల ప్రకారం అలాంటి వారికి లెక్కించినప్పుడు మొత్తం 1,53,600 మంది ఉన్నారు.

  5. అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.

  6. మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే,

  7. యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.

  8. దేశ ప్రజలు బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు చేస్తారు; పేదవారిని దరిద్రులను హింసిస్తారు, విదేశీయులను అన్యాయంగా బాధిస్తారు.

  9. మీరు దానిని మీకు మీ మధ్య నివసిస్తూ పిల్లలను కన్న విదేశీయులకు వారసత్వంగా పంచుకోవాలి. మీరు వారిని స్థానిక ఇశ్రాయేలీయులుగా పరిగణించాలి; మీతో పాటు వారికి ఇశ్రాయేలు గోత్రాల మధ్య వారసత్వం ఇవ్వబడుతుంది.

  10. ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. “తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  12. ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు.

  13. ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము?

  14. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగిగా చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు’ అని చెప్తాడు.